హీరో మోహన్ బాబు కుంటుంబ రచ్చకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. వర్సిటీ గేటు వద్ద పోలీసులు వేచి ఉన్నారు.
గత కొన్ని రోజులుగా మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు వర్సిటీకి భారీ ర్యాలీతో వెళ్తున్నాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎవరినీ అనుమతించడం లేదు. గేట్లను కూడా మూసివేశారు.