ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని జడ్జి కావేరి బవేజా తెలిపారు. ఈ నెల 7కి కేసును వాయుదా వేస్తూ కోర్టు తుది విచారణ జరుపుతామని తెలిపింది. రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ రోజే కేసును కవిత న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు.
సీబీఐ చార్జ్ షీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత డిఫాల్ట్ బెయిల్‌కు అర్హురాలని జూలై 6న కవిత న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. చార్జ్ షీట్లో తప్పులేవి లేవని సీబీఐ తెలిపింది. ఇప్పటికే సీబీఐ చార్జ్ షీట్‌ను జూలై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆగస్టు 9న చార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.