భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించారు. సరిగ్గా నడవడానికి కష్టపడడం వీడియోలో కనిపించింది. దాంతో ఇద్దరు వ్యక్తులు అతడిని చేతులు పట్టుకుని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లడం వీడియోలో ఉంది
అయితే, వీడియో చూసిన వారిలో కొందరు అతను తాగి ఉన్నారని చెబుతుంటే.. మరికొందరు ఆయన కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారని చెబుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించడం వల్ల సరిగ్గా నడవలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను ఓ యూజర్ సచిన్ టెండూల్కర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి విచారంగా ఉందంటూ ట్వీట్ చేశారు. సచిన్ అతనిని ఆదుకోవడానికి వస్తారని, కాంబ్లీకి పునరావాసం కల్పించడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నానని ట్వీట్‌లో పేర్కొన్నాడు.