అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. అధికారులతో సీఈసీ కీలక సమీక్ష..

స్వతంత్ర వెబ్ డెస్క్:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఎలక్షన్‌ నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న తొలిరోజు పార్టీల ప్రతినిధులతో భేటీ అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. పలు అంశాలపై మాట్లాడింది. ఇవాళ 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమావేశమయింది. ఈ సమావేశం ఉ.9:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలపై అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అలాగే రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని.. నోటిఫికేషన్ ఉంటుందని ఈసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రజల్లో ఎన్నికలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌పై ప్రత్యేక వాకథాన్, సైక్లింగ్‌ కార్యక్రమాలను సీఈసీ ప్రారంభించారు.

తెలంగాణ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి కీలక సమీక్షలు నిర్వహిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఈ బృందం ఇప్పటికే.. రాజకీయ పార్టీలతో భేటీ అయింది. పది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ముగ్గురు ప్రతినిధుల చొప్పున ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఒక్కో పార్టీతో విడివిడిగానూ చర్చించారు ఈసీ ప్రతినిధులు. ఈ సమావేశంలో ఆయా పార్టీలు తమ అభ్యంతారాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి.

ఇదిలాఉంటే.. మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. వరుస భేటీల అనంతరం.. నోటిఫికేషన్ పై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని.. దానికి సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దూకుడు పెంచాయి. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ.. మాటల తుటాలు పేలుస్తున్నాయి.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్