కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని TPCC అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చిత్రపటాలను దగ్ధం చేశారు. తక్షణమే బండి సంజయ్, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై ప్రధాని మోదీ వివక్షతను విడనాడాలని చనగాని దయాకర్ కోరారు. ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులను తీసుకురావడంలో విఫలం చెందారని అన్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ చిత్రపటాలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు
0
215
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


