33.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

కాంగ్రెస్, బీఆర్ఎస్ డైలాగ్ వార్

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ ఎపిసోడ్ అంతకంతకు పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది. అంతకు మించి అన్నట్టుగా ఇరు పార్టీల మధ్య వార్‌ ముదురుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కంటిన్యూ అవుతున్న రాజకీయ రగడ.. పార్లమెంట్‌ ఎలక్షన్‌ వేళ మరింత రక్తి కట్టిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య పొలిటికల్‌ వివాదం రంజుగా సాగుతోంది. ఎవరికెవరూ తగ్గడం లేదు. మొన్నటి వరకూ కాళేశ్వరం, మేడిగడ్డ, అవినీతి, అప్పులు అంటూ ఇరు పార్టీలు డైలాగ్ వార్‌కి దిగితే,.. ఇప్పుడ దే రేంజ్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నడుస్తోంది. అది మాత్రమే కాదు,.. ఆపరేషన్‌ ఆకర్ష్‌, గేట్ల రాజకీయం, వాటర్‌ వార్‌ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇవే అంశాలతో అటు హస్తం, ఇటు గులాబీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. కౌంటర్‌ ఎటాక్‌లతో విరుచుకుపడుతున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతలపై నిప్పులు చెరిగారు. తనకు ఫోన్‌ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే తన క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడు తున్నారు. ఇలాగే ఆరోపణలు చేస్తే మంత్రి అయినా,.. ముఖ్యమంత్రి అయినా తాట తీస్తామని హెచ్చరించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇదే కాదు పార్టీ ఫిరాయింపులపై కూడా స్పందించారు కేటీఆర్‌. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డెడ్‌లైన్‌ సమయానికి స్పీకర్‌ స్పందించకపోతే న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు. రైతు ఆత్మ హత్యలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనన్న ఆయన.. 25 లక్షల రూపాయలు ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. 24 గంటలు బెదిరింపులకు పాల్పడి ఢిల్లీకి సూట్‌ కేసులు పంపే పనిలో పడ్డారని విమర్శించారు కేటీఆర్‌.

హైదరాబాద్ ప్రజలు ఓటే వేయలేదని పగ తీర్చుకుంటున్నారా అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్‌. నీళ్ల వనరు ఉన్నా నగరవాసులకు నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ట్యాంకర్లు కొనే దుస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రజల కోసం ప్రాజెక్టు గేట్లు తెరవాలన్నారు కేటీఆర్‌. ఫోన్‌ ట్యాపింగ్‌పై కాదు.. ట్యాప్‌లపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ను ఎలా దెబ్బ కొట్టాలనే ఆలోచన తప్పితే.. జనానికి, రైతులకు బాగు చేయాలన్న తపన లేదని విమర్శలు గుప్పిం చారు. పార్లమెంట్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ల మధ్య పోటాపోటీ డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమైన ఈ పొలిటికల్‌ యుద్ధం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయినా సద్దుమణుగుతుందా..? లేదంటే ఫలితాల తర్వాత ఇంకెలా ఉండనుందన్నది ఆసక్తిగా మారింది.

Latest Articles

పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. ఆమె విజయం ఆదర్శం

పశ్చిమ బెంగాల్‌లోని ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి కలితా మాఝీ విజయం సాధించారు. ఆమె తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి శ్యామా ప్రసన్న లోహర్‌పై గెలుపొందారు. రాజకీయాల్లోకి రాకముందు కలితా మాఝీ ఇళ్లలో సహాయకురాలిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్