స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు రోజుల నుంచి కేంద్ర ఎన్నికల తెలంగాణలో పర్యటించి పరిశీలన చేపట్టింది. నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ విడుత చేసింది. శాసన సభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఇవాళ్టితో ముగిసింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణలో స్త్రీ,పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామం అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్ లో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. యువ ఓటర్ల సంఖ్య దాదాపు 8 లక్షల వరకు దాటడం ప్రశంసనీయమన్నారు. తాజాగా 2022-23 సంవత్సరంలో దాదాపు 22 లక్షలకు పైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్టు తెలిపారు. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదు అని.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతతో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యాం.
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు పేర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగవచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయి. అలాంటిదేమి లేదు. ముఖ్యంగా తెలంగాణలో 80 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.