బెంగళూరులో బాంబు పేలుడు …. పోలీసులు అలర్ట్

  బెంగళూరులో బాంబు పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పలుచోట్ల పోలీ సుల తనిఖీలు జరుగుతున్నాయి. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంఘటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ అధికారులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌‌ వద్ద CISF , ఎయిర్ పోర్టు ఇంటెలిజెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో ఎయిర్‌పోర్ట్ విలేజ్‌లో తనిఖీలు జరిపారు. ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రతి ప్రయాణికుని సెక్యూరిటీ ఆధికారులు క్షుణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాదు.. ప్రతి ప్రయాణికుడి లగేజీ బ్యాంగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత లోనికి అనుమతిస్తున్నారు.

    బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనిపై జాతీయ దర్యాప్తు బృందం సోదాలు చేస్తోంది. ఒక బ్యాగులో తీసుకొచ్చిన పదార్థాలే పేలుడికి దారితీసినట్టు సమాచారం. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు పోలీ సులు తెలిపారు. బాంబ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ టీం ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీతో గుర్తించారు. గుర్తు తెలి యని వ్యక్తి ఒక బ్యాగ్‌ను హోటల్‌లో వదిలివెళ్లినట్లు గుర్తించారు

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్