స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సచివాలయం నిర్మాణంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా ఈ సచివాలయాన్ని నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన సచివాలయాన్ని పూర్తిగా మార్చివేస్తామని తెలిపారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసం, ఓ సామాజిక వర్గాన్ని సంతృప్తి పర్చడానికే సచివాలయం నిర్మాణం ఉందన్నారు. నల్లపోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలు, మసీదుకు ఐదు గుంటలు ఇస్తారా? అని ప్రశ్నించారు. హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టనంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు చేసిన అనంతరం సచివాలయంలోకి అడుగుపెడతానని బండి సంజయ్ స్పష్టం చేశారు.
అధికారంలోకి రాగానే సచివాలయం కూల్చేస్తాం: బండి
0
353
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


