స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ మంత్రి విడదల రజనీకి ప్రమాదం తప్పింది. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి ప్రయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో జర్నలిస్టుల కోసం వైద్య పరీక్షల కేంద్రం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని లిఫ్టులో చిక్కుకున్నారు. ఆమెతో పాటు లిఫ్టులో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులు కూడా లిఫ్టులో చిక్కుకున్నారు. ఓవర్ లోడ్ అవ్వడంతో కొద్దీ నిమిషాల పాటు లిఫ్ట్ నిలిచిపోయింది. అయితే ఎమర్జెన్సీ కీ ద్వారా లిఫ్ట్‌ను సిబ్బంది ఓపెన్ చేశారు. లిఫ్టులో చిక్కుకున్న మంత్రి కాసేపు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రి విడదల రజినికి తప్పిన ప్రమాదం
0
298
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


