AP SSC Exams |ఏప్రిల్‌ 3నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే..

AP SSC Exams |ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలు ఈనెల ౩వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి 12గంటల 45 నిమిషాల వరకు పరీక్షా సమయంగా నిర్ణయించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించబోరన్నారు. మొత్తం 6లక్షల 9వేల 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వీరిలో 3లక్షల 11 వేల 329 మంది బాలురు, 2 లక్షల 97 వేల 741 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు. వీరి కోసం 3 వేల 349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను అనుమతించబోమని చెప్పారు. ఉదయం పదో తరగతి పరీక్షల(AP SSC Exams) అనంతరం మద్యాహ్నం ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఈ నెల వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

Read Also:  ఇంటర్వ్యూకి వెళ్తున్నారా.. ఇలా చేస్తే జాబ్‌ గ్యారంటీ..

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్