25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఓకే.. మనీ మేనేజ్‌మెంట్‌ తెలుసా..

Money Management Tips |పోల్‌ మేనేజ్‌మెంట్‌ గురించి అందరికీ తెలుసు.. అంటే ఎన్నికల సమయంలో గెలుపు కోసం రచించే వ్యూహాలు.. ప్రణాళికలు.. ఎత్తుగడలు ఇవ్వన్నీ పోల్‌ మేనేజ్‌మెంట్‌ కిందకు వస్తాయి. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో విజయం సాధించడం అంటే.. అవతలి పార్టీ వాళ్ల కంటే మెరుగ్గా.. పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తే ఎన్నికల్లో గెలిచినట్లే.. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్‌ అయినా.. ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవిచూడాల్సి వస్తుంది. అది కూడా కొన్నిసందర్భాల్లో మాత్రమే చాలా అరుదుగా జరుగుతుంటాయి. పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఓకే.. మరి మనీ మేనేజ్‌మెంట్‌ గురించి ఎంత మందికి తెలుసు.. ఈ పదం దాదాపు అందరికీ తెలిసినట్లే ఉంటుంది. కాని దానిని పాటించేవాళ్లు చాలా తక్కువుగా ఉంటుంటారు. ఓ రకంగా ఈ పదం సేవింగ్స్‌ సంబంధించిన పదంగా చెప్పుకోవచ్చు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్‌ అయినవాళ్లు ఎన్నికల్లో ఎలా గెలుస్తారో.. మనీ మేనేజ్‌మెంట్‌ను పాటించిన వాళ్లే.. జీవితంలో సక్సెస్‌ అవుతారు. మరి అసలు మనీ మేనేజ్‌ మెంట్‌కు సంబంధించిన కొన్ని చిట్కాలు తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో లక్ష్యాలు.. కళలు ఉంటాయి.. వాటిలో కొన్ని జీవిత లక్ష్యాలు ఆర్థిక సంబంధమైనవై ఉంటాయి. మనం ఏ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఆర్థిక వనరులు అవసరం. సాధారణంగా ధనికులైతే ఆర్థికపరమైన విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అదే పేద, మధ్య తరగతి ప్రజలైతే ఆర్థిక వనరుల విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదే మనీ మేనేజ్‌మెంట్‌ ఫాలో అయితే ఆర్థికపరమైన అంశాల్లో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

మనీ మేనేజ్‌మెంట్‌(Money Management Tips) విషయానికొస్తే.. మన సంపాదన ఎంత.. ఖర్చులు ఎంత.. అనవసరమైన ఖర్చుల కోసం ఎంత వెచ్చిస్తున్నాం అనే విషయంలో స్పష్టత ఉండాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని.. వాటిని పొదుపు చేసుకోవడంతో పాటు.. ఖర్చుల విషయంలో కొన్ని పరిమితులు విధించుకుంటే మన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలా పొదుపు చేసుకున్న మొత్తాన్ని మన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. పిల్లల ఉన్నత చదువులు లేదా గృహ అవసరాలు, గృహ నిర్మాణం, వివాహం.. ఇలా పెద్ద మొత్తంలో ఖర్చులకు పొదుపు మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మనీ మేనేజ్‌మెంట్‌ను ఫాలో అయితే తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతమేర ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.

Read Also:  ఏప్రిల్‌ 3నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే..

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్