సూర్యుడి దిశగా పయనమైన ఆదిత్య ఎల్-1.. విజయవంతంగా కక్ష్య పెంపు

స్వతంత్ర వెబ్ డెస్క్: సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 లక్ష్యం దిశగా పయనమైంది. ఇప్పటికే దాని కక్ష్యను నాలుగుసార్లు పెంచిన శాస్త్రవేత్తలు తాజాగా ఐదోసారి పెంచి సూర్యుడి ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్-1 దిశగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో తెలిపింది.

ఇప్పటి నుంచి ఉపగ్రహం 110 రోజులు ప్రయాణించి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎన్-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు మరోమారు విన్యాసం చేపట్టి ఎల్-1 కక్ష్యలో ప్రవేశపెడతారు. సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కొరోనా వంటివాటి పరిశోధనకు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టింది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్పేస్ ఆధారిత సోలార్ అబ్జర్వేటరీ మిషన్.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్