అవినీతి చంద్రబాబునాయుడిని సమర్థించడం కోసం ఎల్లో మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మీరు, మీ కుటుంబసభ్యులు చేస్తోన్న ప్రయత్నాలు ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు, అతనితో పాటు ఉన్న నిందితులు ఈ కేసులో తప్పు చేసినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీమెన్స్ సంస్థ అంతర్గత విచారణలో సుమన్ బోస్ అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని, అందుకే కంపెనీ ఆయనను తొలగించిందని పేర్కొన్నారు.
వైసీపీ వైపు వేలు చూపించడం ద్వారా యువతపట్ల, ప్రజాస్వామ్యం పట్ల తమ నిబద్ధతను ప్రశ్నించలేరన్నారు. ఇలాంటివి వాస్తవాలను మార్చవన్నారు. నిజానికి స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఏపీలోని సామాన్యులు, యువత జీవితాలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయం వైసీపీ కోరుకుంటోందని చెప్పారు. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు, బాధ్యుల కోసం నిష్పాక్షిక దర్యాఫ్తు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్రానికి చెందిన పౌరులుగా తాము ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, అలాగే రాష్ట్ర యువత భవిష్యత్తును కోరుకుంటున్నామన్నారు. ఇందుకోసం వైసీపీ కృషి చేస్తోందని, దీనిని కొనసాగిస్తుందన్నారు. సామాన్యుల కోసం ఎల్లప్పుడూ పని చేస్తామన్నారు.