BJP Parliament Prawas Yojana meeting | హైదరాబాద్లో నేడు బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం జరగనుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత వహించనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలపై విజయం సాదించేందుకు పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో చేరికలు. అమిత్ షా పర్యటన పాటుగా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. పార్లమెంట్ కన్వీనర్, ప్రభారీ, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీలతో సునీల్ బన్సల్ సమావేశం కానున్నారు.
నేడు బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం
0
351
Previous article
Latest Articles
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


