తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని… ఎంత వ్యతిరేకించినా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడం లేదని భూమన ఆరోపించారు. టీటీడీ స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించడంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఓబెరాయ్ హోటల్ నిర్మాణం వల్ల శ్రీవారి పవిత్రతకు భంగం కలుగుతుందని భూమన అభిప్రాయపడ్డారు. దీనిపై స్వామీజీలు, పీఠాధిపతులు స్పందించాలని కోరారు. టీటీడీ స్థల కేటాయింపుపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని భూమన తెలిపారు.
ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
Latest Articles
- Advertisement -


