వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో సొరంగంలోకి వెళ్లిన మంత్రి..అక్కడ జరుగుతున్న లైనింగ్‌, టీబీఎం తొలగింపు పనులను పరిశీలించారు. పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రాజెక్ట్‌ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్‌ పనులు పూర్తయినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. కొల్లంవాగు నుంచి టన్నెల్స్‌లోకి నీరు చేరేందుకు జరుగుతున్న మక్ తొలగింపు పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామన్న ఆయన… టన్నెల్-1, టన్నెల్-2ల్లో అడ్డుగా ఉన్న మట్టిని తొలగింపు పనులు స్పీడప్ చేసినట్లు వెల్లడించారు. సీజన్ ప్రారంభానికి ముందే నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు

Latest Articles

కల్వకుంట్ల కవిత స్కెచ్ మామూలుగా లేదుగా..!

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ 'తెలంగాణ రక్షణ సేన' సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. మొన్నటి వరకు బతుకమ్మ, బోనాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్