భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు.

తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన పార్టీ. తెలంగాణ మీద నాకు ప్రేమ ఉంది. తెలంగాణలో లక్ష మందికి పైగా జనసేన నాయకులు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాకముందే..తెలంగాణ నుంచి పోరాట స్ఫూర్తిని పొందాను. నా సినిమాల్లో తెలంగాణ స్ఫూర్తి కనిపిస్తుంది. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని.

జనసేనకు తెలంగాణ ఎందుకని కొందరు అంటున్నారు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకమని అంటున్నారు. విభజన తీరుకు నేను వ్యతిరేకం. పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేసిన తీరు తప్పని చెప్పాను. తెలంగణ సంస్కృతికి, రాష్ట్ర ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు. ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదని వైసీపీ అంటే తెలంగాణ ప్రజలు నాకు అండగా నిలబడ్డారు.

జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో జనసేన ఆశయాలను తీసుకెళ్లాలని కార్యకర్తలకు చెప్పాను. తెలంగాణలో అధికారం కోరుకోవడం లేదు.. ఒక్క మార్పు తప్ప. తెలంగాణ ప్రజలకు ఆంధ్రా మీద విద్వేషం లేదు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారే తప్ప ఏపీ మీద ఎలాంటి విద్వేషం లేదు. హైదరాబాద్‌లోకి ఎలా అడుగుపెడతాం అని అంటున్నారు. నన్ను బెదిరించడానికి మీరెవరు? మీ అయ్య జాగీరా తెలంగాణ. తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రలో బెదిరింపులే ఎక్కువ. నా మీద దాడి చేయాలంటే ఇంటి దగ్గరే ఉంటాను. భయపడే వాడినే అయితే పార్టీ పెట్టేవాడినే కాదు. ఎవరెన్ని తిట్టినా నా గుండెల్లో తెలంగాణ ఉంది.

తెలంగాణలో ఉపాధి లేకపోతే నేను కారణమా. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చింది. సడన్‌గా ఇక్కడికి రావొద్దంటే ఎలా?. పాలకులు వేరు.. ప్రజలు వేరు.

ఇప్పటి వరకు డిసైడ్‌ అవ్వలేదు.. కానీ ఇప్పుడు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన ఉంటుంది.. మేము పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం.. నేనే తిరుగుతా. ప్రతి సమస్య మీద మాట్లాడతా. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం.

ఓ విశ్లేషకుడు అమిత్‌ షా , నేను మాట్లాడుకున్నామని చెప్పిన వ్యాఖ్యలను ఖండించాను. జనసైనికులు కేసులు పెట్టారన్న విషయం కూడా నాకు తెలియదు. పాలకులు విద్వేషాలను రెచ్చగొడితే దేశం ఎటువెళ్తుంది? చెరువులను కబ్జా చేశానని అంటున్నారు. నిజంగా చెరువులను కబ్జా చేస్తే నా ఇల్లు తగలబెట్టేయరా? ఉంచుతారా?.. రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం.. ఆయనంటే గౌరవం. నేను చెరువును కబ్జా చేసి ఉంటే ఆ చెరువును నేను ప్రభుత్వానికి రాసిస్తాను.

మర్రిచెన్నారెడ్డి.. సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆంధ్రా వాళ్లను తిడుతుంటే.. వాళ్లు ఇక్కడెలా ఉంటారు? నాకు ఎంత కమిట్‌మెంట్‌ లేకపోతే కొండగట్టు ఆంజనేయ స్వామికి టీటీడీ నుంచి రూ.30 కోట్లు ఇప్పిస్తాను? జూబ్లిహిల్స్‌లో నా ఆఫీసుకు వచ్చి .. గద్దర్‌ కారు కొనివ్వాలని అడిగారు. రెండు రోజుల్లో కారు కొనిచ్చాను.. మీరు ఆయనకు ఏం చేశారు? నాకు మొదటి కేసు తెలంగాణలోనే నమోదైంది. దాడులు కొత్తేమీ కాదు. తాటాకు చప్పుళ్లకు జనసేన భయపడదు. మహబూబ్‌నగర్‌, ఖమ్మంలో దాడులు చేస్తే తట్టుకున్నాం. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లం కాదు. కాంగ్రెస్‌ నేతలు నాలుక కొస్తామని మాట్లాడుతున్నారు. ఎవరొస్తారో రండి నాలుక చూపిస్తా. తెలంగాణకు అన్యాయం జరిగితే.. ఫస్ట్‌ మాట్లాడేది జనసేననే.

నాకు లెఫ్ట్‌ వింగ్‌, రైట్‌ వింగ్‌ తెలియదు.. నాది హ్యూమనిజం. తప్పు జరిగిఉంటే మీరు ప్రాపర్టీని సీజ్‌ చేసుకోండి. దేశంలో అన్ని జాతులు ఉన్నాయి. తెలంగాణకు ద్రోహం జరిగితే మొదటి గొంతు మాదే లేచేది. కేసీఆర్‌ ఆంధ్రలో బీఆర్‌ఎస్‌ పార్టీ పెడితే స్వాగతించాను. యురేనియం మైనింగ్‌ జరుగుతుంటే శ్రీశైలం వెళ్లి పోరాడాను.

పంజాబ్‌, మహారాష్ట్రలో పార్టీ పెట్టొచ్చు. కానీ తెలంగాణలో జనసేన పార్టీ పెట్టకూడదా?. తెలంగాణ సీఎంని అవుతానని భయమా?. తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తామని భయం. 2వేల మందితో సభ పెట్టుకుంటామంటే పర్మిషన్‌ కూడా ఇవ్వలేదు. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు పవన్‌ కళ్యణ్‌ హెచ్చరించారు. ఇది భారత్‌ అనుకున్నారా?.. పాకిస్తాన్‌ అనుకున్నారా? ఇది నా దేశం.. నేను ఎక్కడైనా అడుగుపెడతా. నన్ను రావొద్దు అనడానికి మీరెవ్వరు? ఉద్యోగం కోసం ఉపాధి కోసం వచ్చే వారిని భయపెట్టకండి. ట్యాక్స్‌లు కడుతున్నాం.. సమాజం కోసం నిలబడతాం. బెదిరిస్తుంటే.. ఎంతకాలం బెదురుతాం. మీరు భయపెట్టే కొద్ది గుండె గట్టిపడుతుంది. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే ఇవాళ పదవుల్లో ఉన్నారు. ఇప్పటంలో కాంగ్రెస్‌ దిమ్మలు కూల్చేస్తే.. నేను నిలబెట్టా. నన్ను బెదిరించిన వాళ్ల విషయంలో రాహుల్‌ గాందీ స్పందించాలి. ఏ రాష్ట్రానికి వెళ్లిన పాస్‌పోర్టులు తీసుకుని రావాలా? దమ్ముంటే పవన్‌ తెలంగాణ రావొద్దని అసెంబ్లీలో తీర్మానం చేయండి.. చూద్దాం. తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీల గురించి ఎందుకు మాట్లాడరు?

ఐలవ్‌ పాకిస్తాన్‌ అని ఓ కాంగ్రెస్‌ నాయకుడు అంటే ఇవాళ పవన్‌ ప్రెస్‌ మీట్ పెడితే పీస్‌ ఇన్‌ హార్మొనీ దెబ్బతింటుందని అన్నారు. బెంగాలా్‌కు వస్తే తరిమేస్తామని అమిత్‌ షాను బెదిరించారు. కొన్నాళ్లు పోతే.. వందేమాతరం పాడబోమని కూడా అంటారు. తెలంగాణకు వలసలు తగ్గాలంటే ఏపీలో ఉద్యోగ అవకాశాలు రావాలి. అప్పుడే తెలంగాణ యువతకు ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేంద్ర దృష్టి పెట్లాలి… అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Latest Articles

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది… పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

తెలంగాణకు వలసలు తగ్గాలంటే ఏపీలో ఉద్యోగ అవకాశాలు రావాలిఅప్పుడే తెలంగాణ యువతకు ఉద్యోగాలు పెరుగుతాయిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేంద్ర దృష్టి పెట్లాలినన్ను రావొద్దు అనడానికి మీరెవ్వరు ఉద్యోగం కోసం ఉపాధి కోసం వచ్చే వారిని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్