బెంగాల్‌ రాజకీయల్లో హైడ్రామా.. టీఎంసీలో చీలిక.. న్యూ తృణమూల్‌ ఏర్పాటుకు సన్నాహాలు

బెంగాల్‌ రాజకీయల్లో హైడ్రామా కొనసాగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ టీఎంసీలో చీలిక ఏర్పడింది. పార్టీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. న్యూ తృణమూల్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంతకాల ఫోర్జరీతో మొదలైన వివాదం పార్టీలో చీలిక వరకు వెళ్లింది. కోల్‌కతాలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో రెబల్‌ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. అసలైన తృణమూల్ తమదే అంటూ గుర్తు కోసం పోరాటం చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెబల్‌ ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ ఫైరయ్యారు. కుట్ర రాజకీయాలు సాగవు.. తానే పెద్ద ప్లేయర్‌ని అంటూ సవాల్‌ విసిరారు.

మరోవైపు పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాల ఫోర్జరీ ఆరోపణ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు 13 మంది ఎమ్మెల్యేల వాంగ్మూలాలు నమోదు చేసింది. ఈ కేసులో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు అభిషేక్‌ బెనర్జీ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయనకు తాజాగా సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్