సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ చేశారు.. నిందితుడు కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పథక రచన చేశాడు.

మొదట నమ్మకాన్ని సంపాదించి.. తర్వాత చిన్న చిన్న ట్రాన్సాక్షన్లతో బాధితుడి విశ్వాసాన్ని చూరగొని ఆ తరువాత వలలో దింపాడు. చివరికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఈ వివరాలు దర్యాప్తులో బయటపడ్డాయి. బాధితుడి నుంచి దాదాపు 24 కోట్ల రూపాయలను వివిధ దశల్లో వసూలు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ నిధులను సూటిగా కాకుండా.. అనేక డిజిటల్ మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.

ఈ విధంగా వసూలు చేసిన డబ్బును కేవలం దాచడానికే కాకుండా, విదేశాల్లో మైనింగ్ లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నెట్‌వర్క్ కేవలం లోకల్ గ్యాంగ్ కాదు, అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న వ్యవస్థలా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు.

నైజీరియా తరహా సైబర్ మోసగాళ్ల మోడల్‌ను పోలి ఉండటంతో, నిందితుడికి మరిన్ని దేశాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.కేసు నమోదు అయిన వెంటనే కొచ్చి సిటీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ట్రాకింగ్, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా నిందితుడి లొకేషన్‌ను గుర్తించి హైదరాబాద్‌లో ఆపరేషన్ నిర్వహించి… వ్యాపారి సత్యనారాయణ మూర్తిని అదుపులోకి తీసుకు న్నారు.తరువాత అతడిని కొచ్చి కి తరలించి ఇంటెన్సివ్ విచారణ చేస్తున్నారు

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్