యాక్టింగ్ మొదలుపెట్టిన హరీష్ శంకర్..?

హరీష్ శంకర్.. తన సినిమాలతో కన్నా.. తన కామెంట్స్ తో.. ఎక్కువుగా వార్తల్లో ఉంటుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఎప్పటి నుంచో సెట్స్ పైనే ఉంది. ఇటీవల తీసిన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. ఇప్పటి వరకు కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. అయితే.. ఇప్పుడు హరీష్ శంకర్.. కొత్తగా యాక్టింగ్ మొదలుపెట్టాడని తెలిసింది. డైరెక్టర్ గా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..? యాక్టింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి..?

షాక్ మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన హరీష్ శంకర్.. తొలి ప్రయత్నంలో టైటిల్ కి తగ్గట్టే పెద్ద షాకే తగిలింది. ఆతర్వాత మాస్ మహారాజా రవితేజతో తీసిన మిరపకాయ్ మూవీతో సక్సెస్ సాధించాడు. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో గబ్బర్ సింగ్ అంటూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించాడు. ఆతర్వాత రామయ్య వస్తావయ్య, సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథమ్, గద్దలకొండ గణేష్‌, మిస్టర్ బచ్చన్ ఇలా.. పక్కా కమర్షియల్ మూవీస్ అందించాడు. అయితే.. రీసెంట్ గా తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పటి నుంచో సెట్స్ పైనే ఉంది. ఎప్పుడు పవర్ స్టార్ డేట్స్ ఇస్తారో.. ఎప్పుడు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. హరీష్ శంకర్ ఇప్పుడు ఓ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసింది. ఏ సినిమాలో అంటే.. సుహాస్ హీరోగా నటిస్తోన్న ఓ భామ అయ్యో రామ అనే సినిమాలో. ఇందులో సుహాస్ కు జంటగా మాళవిక మనోజ్ నటిస్తోంది. ఈ విభిన్న ప్రేమకథా చిత్రంలో హరీష్ శంకర్ నటిస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అసలు అంతలా ఏముంది ఈ సినిమాలో అనేది ఆసక్తిగా మారింది. హరీష్ శంకర్.. ఈవెంట్స్ లో మైక్ అందుకుంటేనే అదరగొట్టేస్తాడు. అలాంటిది సిల్వర్ స్క్రీన్ పై ఇంపార్టెంట్ రోల్ అంటే.. మెప్పించడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే హరీష్ శంకర్ చేసేలా క్యారెక్టర్ ఏంటి అనే క్యూరియాసిటీ పెరిగింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. బాలయ్యతో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. యాక్టర్ గా క్లిక్ అయితే.. హరీష్ శంకర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతాడేమో చూడాలి మరి.

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్