కేంద్ర బడ్జెట్ పై.. బీజేపీ ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ హర్షం ప్రకటించారు. అమరావతిని వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే.. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందని.. ఇది ఏపీ చరిత్రలో చాలా శుభదినంగా నిలిచిపోతుందని.. సుజనాచౌదరి తెలిపారు. గత ఐదేళ్లుగా చట్టం ప్రకారం రావలసిన వాటినే తెచ్చుకోనే స్తోమత లేకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని సుజనాచౌదరి అన్నారు. సంపద సృష్టించడం చంద్రబాబుకు తెలుసని.. డబులింజన్ సర్కార్ థమాకా ఏమిటో .. ఈ రోజు ప్రజలకు తెలిసిందని సుజనా చౌదరి అన్నారు. ఎప్పుడూ లేనన్ని నిధులు కేంద్రం కేటాయించిందని.. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే లక్ష కోట్లు జి ఎస్ డి పి పెరుగుతుందని సుజనాచౌదరి తెలిపారు. ఏపీ కి ఎప్పుడు లేనంత నిధులు ఇవ్వడం సంతోషకరమని.. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏపీకి సంబంధించి పది అంశాలు కూడా మేలు చేసేవే అని కామినేని శ్రీనివాస్ అన్నారు.
అమరావతిని వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసింది – సుజనాచౌదరి
0
186
Previous article
Next article
Latest Articles
రక్తం అమ్ముకుని సంపాదించాల్సిన అవసరం ఉందా..? బ్లడ్ బ్యాంక్ వివాదంపై చిరంజీవి
ఎన్ని విమర్శలు వచ్చినా.. బ్లడ్ బ్యాంక్ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి తన వాదనను మరోసారి స్పష్టంగా వినిపించారు. గతంలో తన బ్లడ్ బ్యాంక్ చుట్టూ రేగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. రక్తాన్ని అమ్ముకుని...
- Advertisement -
- Advertisement -


