మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు మధ్య భూవివాదం

   మాజీ మంత్రి మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పేట్‌బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో భూవివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూవివాదం నెలకొంది. ఈక్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని, దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్‌ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారం టూ పోలీసుల తో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనం టూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని తెలిపారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్‌ ఉన్నందున ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. సమస్యను సామ రస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు పోలీసులు సూచించారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్