ఎన్నికల వేళ వైసీపీ్కి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీని వీడి సొంతగూటికి వెళ్లేందుకు రంగం సిద్ధవవుతోంది. పార్టీ అధిష్టానంపై అలకబూనిన ఆయన.. గత కొంతకాలంగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాడికొండ ఇన్‌చార్జ్‌గా తొలగించడంపై అసహనంగా ఉన్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నా ఆయన మాత్రం అలక వీడలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలు స్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన డొక్కాకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చు కున్నారు. ఆ తర్వాత వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు ప్రాధాన్యం కరవైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని వాపోయారు.
ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్
0
161
Previous article
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


