పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని భూపతినగర్‌లో ఇవాళ ఎన్‌ఐఏ బృందంపై దాడి జరిగింది. ఇద్దరు టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు అధికారుల బృందం భూపతినగర్‌కు వెళ్లింది. అకస్మాత్తుగా 150 మంది గ్రామస్తులు గుమిగూడి నిందితులను తమతో తీసుకెళ్లకుండా NIA బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు ఎన్‌ఐఏ వాహనాలపై రాళ్లతో దాడి చేయడంతో ఇద్దరు అధికా రులు గాయపడ్డారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు 2022లో జరిగిన పేలుడు కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. గత నెలలో ఎన్ఐఏ 8 మంది టీఎంసీ నేతలను విచార ణకు పిలిచింది. మార్చి 28న న్యూ టౌన్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి అందరినీ రావాలని తెలిపింది. ఇదే కేసులో టీఎంసీ నేత మంబేంద్ర జానాతో పాటు మరొకరిని అరెస్ట్ చేసేందుకు ఎన్ఐఏ బృందం భూపతినగర్ చేరుకుంది. విచారణ సమయంలో అక్కడ ఉన్న గ్రామస్తుల నుంచి ఎన్ఐఏ నిరసనలను ఎదుర్కోవలసి వచ్చింది. నిందితులను తప్పించేందుకు అక్కడి ప్రజలు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఎన్ఐఏ అధికా రుల కార్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
మిడ్నాపూర్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులపై దాడి
0
162
Previous article
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


