పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టులు అలజడి

పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టుల అలజడి కలకలం సృష్టిస్తోంది. ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి నిన్నటి వరకు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. సరిహద్దులోని బీజాపూర్ జిల్లా గంగులూరు స్టేషన్‌ పరిధిలో సాయుధ బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే పొర్చెలి అటవీ ప్రాంతంలో వారికి మావోయిస్టులు తారపడ్డారు. దీంతో బలగాలకు, మావోయిస్టులకు మధ్య దశల వారీగా కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మ‌హిళా మావోయిస్టులు..స‌హా మొత్తం 13 మంది మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.

     ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు డంప్‌ను డీవీఎఫ్‌, నిఘా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కలిమెల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దయాల్తుంగ్ సరిహద్దు పోలీసుల గాలింపుల్లో ఈ డంప్‌ దొరికిందని చెప్పారు. ఈ డంప్‌లో పెద్ద మొత్తంలో ఐఈడీలు, ఐఈడీ తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సాధారణ పౌరులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీలుగా వీటిని దాచి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest Articles

బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్