నాలుగో విడత వైఎస్సార్‌ చేయూత పథకం నిధులు విడుదల

     చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. పవన్‌ పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని విమర్శలు గుప్పించారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది అంటూ ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని సీఎం అన్నారు. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చిన మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్‌ నిప్పులు చెరిగారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్