ఇవాళ ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

       ఏపీ సీఎం జగన్‌ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్‌ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్‌ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేస్తారు.

      2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును 20 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభంకాబోతోంది. శ్రీశైలం జలాశయా నికి ఏటా 45 రోజులు పాటు వచ్చే వరద ప్రవాహం అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. 43.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు నల్లమల సాగర్‌ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకువచ్చేందుకు రెండు టన్నెళ్ల నిర్మాణం జరిగింది. కమ్యూనిస్ట్ నేత పూల సుబ్బయ్య పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తరలించేందుకు ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేశారు.

      ప్రకృతి సిద్ధమైన పచ్చని నల్లమల సోయగాల మధ్య ,సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల ఆధారంగా .. ఏర్పాటైన ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 30 మండలాల పరిధిలోని 4. 7 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో పాటు 15.4 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రకృతి సిద్ధంగా ప్రకాశం, కర్నూలు, కడప చిత్తూరు జిల్లాల అనుసంధానంతో వెలుగొండ కొండల శ్రేణులు ఏర్పడి ఉన్నాయి. ఇవి దట్టమైన నల్లమల అవతారణ్యంలో ఉన్నాయి. ఈ వెలుకొండలను అనుసంధానం చేస్తూ… ప్రకాశం జిల్లా లోని గొట్టిపాడియా ,సుంకేసుల ,కాకర్ల  ప్రాంతాలలో ఆనకట్టలను కట్టి నీటిని నిలువ చేసి ఆ నీటితో ప్రధానంగా పశ్చిమ ప్రకాశంతో పాటుగా నెల్లూరు, కడప జిల్లాల ప్రజల పంట అవసరాలతో పాటు దాహార్తిని కూడా తీర్చే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మించారు.

      కాసేపట్లో తాడేపల్లిలోని తన నివాసం వద్ద నుంచి సీఎం జగన్‌ బయల్దేరతారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువచెర్లోపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులను కలుస్తారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శిస్తారు. 10.50 నుంచి 10.55 వరకు ప్రాజెక్టు వ్యూ పాయింట్ సందర్శన ఉంటుంది. 10.55 నుంచి 11.10 వరకు ప్రాజెక్టు లబ్దిదారులు, నిర్వాసితులతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రెండవ టన్నెల్ దగ్గరకు చేరుకుని 11.25 వరకు పనులను పరిశీలించనున్నారు. అనం తరం తాడేపల్లికి బయల్దేరతాను సీఎం జగన్. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో.. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్