‘డియర్ ఉమ’ కోసం నిర్మాతగా మారిన హీరోయిన్!

ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా మల్టీ టాలెంటెడ్‌గా సుమయ రెడ్డి అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం రాబోతోంది. ఇందులో సుమయ రెడ్డి, దియ మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా వ్వవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కూడా నిర్మించారు. టీజర్ రిలీజ్ చేసిన తరువాత సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలుస్తుందని మేకర్లు చెబుతున్నారు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు త్వరలోనే థియేటర్లోకి రానుందని దర్శక నిర్మాతలు తెలిపారు.

నటీనటులు : సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్, కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : సుమ చిత్ర ఆర్ట్స్
నిర్మాత : సుమయ రెడ్డి
దర్శకుడు : సాయి రాజేష్ మహాదేవ్
సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట
సంగీతం : రధన్
ఎడిటర్ : సత్య గిడుతూరి
పీఆర్వో : సాయి సతీష్

Latest Articles

విజయన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత…ఈడీ అధికారుల కారుపై దాడి

కేరళలోని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టరు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్