రాకెట్ రూపకల్పనలో ఎన్నో తప్పులు చేశా – ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌

         హైదరాబాద్ జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జేఎన్‌టీ యూ వీసీ నరసింహారెడ్డి గౌరవ డాక్టరేట్ అదించి సత్కరించారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ ఇండస్ట్రీ , హెరిటేజ్‌ అభివృద్ధిలో హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి అన్నారు. మంచి టెక్నాలజీని తక్కువ ఖర్చుతో ఎలా ఆవిష్కరించగలమో విద్యార్థులకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సూచించారు. ప్రస్తుత కాలంలో అంతరిక్ష రంగం యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. అందుకే ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగంపై ఎంతో ఆసక్తి నెలకొంది.

          దేశంలో చాలామందికి చంద్రయన్ 3 ప్రయోగం గురించి తెలియకపోవచ్చు. కానీ ఈ ప్రయోగం దేశప్రజలను గుర్వించేలా చేసిందనడంలో ఆశ్చర్యం లేదు. గత 60 ఏళ్లుగా ఇస్రో ఎంతో కృషి చేస్తోంది. అంతరిక్ష రంగంలో మరిన్ని అవకాశాలు, ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన జీవితంలో కూడా ఎన్నో అపజయాలు ఉన్నాయని అన్నారు. పరాజయం పాలైనప్పుడు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. వాస్తవానికి ఆయన రాకెట్ రూపకల్పనలో కూడా ఎన్నో తప్పులు చేశాడని, వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని అంతరిక్ష రంగంలో విజయం సాధించానని అన్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ సోమనాథ్.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్