‘దీపావళి’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన  తాజా సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య సమర్పకులు. ఈ చిత్రానికి ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఇది. దీపావళి పండగ సందర్భంగా ఈ శనివారం (నవంబర్ 11న) తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ రోజు సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు.

ఈ గీతానికి గోసాల రాంబాబు సాహిత్యం అందించగా… థీసన్ సంగీతం అందించారు. పండగ ప్రత్యేకత తెలిపేలా ఈ పాట సాగింది. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా ‘దీపావళి’ పాటలు విడుదల అయ్యాయి. ఈ సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘చిట్టి కన్నా…’ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది.

తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే ‘దీపావళి’ ప్రీమియర్ షోలు వేశారు. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుతో పాటు పలువురు మీడియా ప్రముఖుల ప్రశంసలు ఈ సినిమా అందుకుంది. సహజత్వానికి దగ్గరగా మానవ సంబంధాలు, అనుబంధాలను హైలైట్ చేస్తూ… భావోద్వేగభరితంగా సినిమా సాగిందని, ముఖ్యంగా తాత – మనవడు, మనవడు – మేక పిల్ల మధ్య సన్నివేశాలు కంటతడి పెట్టించాయని చాలా మంది ప్రశంసించారు. దీపావళి పండక్కి మనవడికి కొత్త దుస్తులు కొని ఇవ్వాలని దేవుడికి మొక్కుకున్న మేకను అమ్మడానికి తాతయ్య సిద్ధపడతారు. ఆ తర్వాత ఏమైందనేది చిత్రకథ.

పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆడియోగ్రాఫర్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : కె.బి. నందు, లిరిసిస్ట్ : రాంబాబు గోసాల, ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్, సమర్పణ : కృష్ణ చైతన్య, నిర్మాత : స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ఆర్ఏ వెంకట్.

Latest Articles

తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం

తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్‌ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్‌ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్