స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కూకట్ పల్లిలో ఆయన మాట్లాడుతూ, తాను 42 ఏళ్లుగా కాంగ్రెస్ కోసమే పని చేశానని, ఇంత సేవ చేసినా తనకు టికెట్ రాకపోవడంతో నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో తాను బీఆర్ఎస్ చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా నాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కలేదని నాగం జనార్థన్ రెడ్డి, జూబ్లీహిల్స్ టికెట్ తనకు దక్కలేదని విష్ణువర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకీ ఇటీవలే రాజీనామా చేశారు. తాజాగా కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి విష్ణువర్థన్ రెడ్డిలతో పాటు కరీంనగర్ నేత జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వీరితో పాటు వీరి అనుచరులకు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత
0
421
Previous article
Next article
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


