35.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

అలాంటి చిత్రాలే నా లక్ష్యం: నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్‌ కుమార్‌!

సెవెన్ హిల్స్‌ ప్రొడక్షన్ బ్యానర్‌పై బిగ్‌బాస్‌ సీజన్ 7 తెలుగు ఫేమ్ గౌతమ్‌ కృష్ణ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి నాయికలు. పి.నవీన్ కుమార్‌ దర్శకుడు. సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈయన గతంలో “బట్టల రామస్వామి బయోపిక్కు” అనే చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలతోపాటు చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి ఆర్‌.పి. పట్నాయక్‌‌తో “కాఫీ విత్ ఏ కిల్లర్” చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న మూడో చిత్రమిది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి.

నిర్మాత సెవెన్ హిల్స్  సతీష్‌ కుమార్‌  పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  మాట్లాడుతూ “గతంలో నేను నిర్మించిన రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. “ఆకాశవీధుల్లో” చిత్రంతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్ 7 షోతో మరింత పాపులర్‌ అయిన గౌతమ్‌ కృష్ణతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అతనికి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఈ కథకు పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయ్యాడు. గౌతమ్‌ బిగ్‌బాస్‌ షో నుండి తిరిగి రాగానే చివరి షెడ్యూల్‌ పూర్తిచేస్తాం. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి స్టూడెంట్‌ నుంచి కార్పొరేట్‌ స్థాయికి ఎలా ఎదిగాడు అన్న ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమిది. ఫ్యామిలీ, యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం. యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలతో చిత్రాలు తీయాలన్నదే నా  లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని చెప్పారు.

ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్‌.కె మామ, ఆనంద్‌ చక్రపాణి, భద్రం, పింగ్‌పాంగ్‌ సూర్య, ల్యాబ్‌ శరత్ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
కెమెరా: త్రిలోక్‌ సిద్దు,
సంగీతం: జుడా శాండీ
ఎడిటర్‌ : ప్రవీణ్‌ పూడి
కో-డైరెక్టర్‌ : కినోర్‌ కుమార్‌
పిఆర్వో : మధు విఆర్‌
నిర్మాత : సెవెన్ హిల్స్‌ సతీష్‌ కుమార్‌,
దర్శకత్వం: పి.నవీన్ కుమార్

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్