Kailash Choudhary: ఇండియాలో ఉండాలంటే తప్పకుండా ‘భారత్ మాతాకీ జై’ అనాల్సిందే

స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉండాలనుకుంటున్న వారు తప్పకుండా ‘భారత్ మాతాకీ జై’ అనాల్సిందేనని తేల్చి చెప్పారు. వ్యవసాయశాఖ సహాయమంత్రి అయిన ఆయన బీజేపీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ రైతు కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులు వాడుతున్న భాషను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని, రాష్ట్రం (తెలంగాణ)లో జాతీయవాద ఆలోచనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు.

ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అంటారా? అని ప్రశ్నించారు. ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ అన్న వారికే దేశంలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘ఎవరైతే ‘భారత్ మాతా కీ జై’ అనరో, ఎవరికైతే హిందూస్థాన్ మీద, భారత్ మీద విశ్వాసం లేదో, ఎవరైతే ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటారో వారు పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందే. అలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు’’ అని మంత్రి తేల్చి చెప్పారు.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్