34.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ఇచ్ఛాపురం నుంచి వైసీపీ బస్సు యాత్ర..షెడ్యూల్‌ ఇదే

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమైన వైసీపీ షెడ్యూల్ ఖరారు చేసింది. తొలి విడత యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈనెల 26న ప్రారంభించేందుకు సిద్ధమైంది. నవంబర్ 9 వరకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. పార్టీలోని ఆయా వర్గాల సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొని సభల్లో ప్రసంగించనున్నారు. కాగా, ఈ నెల 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఈ నెల 16వ తేదీన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్‌ నెంబర్‌ 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం వైఎస్‌ జగన్‌.

Latest Articles

తెలంగాణలో 11 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలక మండళ్లు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్