Pawan Kalyan: మరోసారి పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత..

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన వారాహి యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరిస్తున్న సమయంలో తీవ్ర వెన్ను నొప్పికి గురయ్యారు. కాసేపు రిలాక్స్ అయినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో ఆయన జనవాణి కార్యక్రమాన్ని ఆపేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన వెన్నుపూసకు గాయమయింది. తాను తరచుగా వెన్ను నొప్పికి గురవుతున్నానని 2019లో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల వెన్ను నొప్పి పెరిగిందని ఆ ప్రకటనలో ఆయన వెల్లడించారు. పవన్ వెన్ను నొప్పికి గురికావడంతో అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్