తెలంగాణ అభివృద్ది తెలిసేలా.. కోమటి చెరువులో 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ

స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి హరీష్ రావు(Harish Rao) నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో హరీష్‌ రావు పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్దిని డ్రోన్ షో ద్వారా తెలిసేలా నిర్వహించనున్నారు. హరీష్‌ రావు శనివారం సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే.. నెల రోజుల్లో పంట రుణమాఫీ(Loan waiver) పూర్తి చేస్తామని, ఈ ప్రక్రియ పూర్తయితే మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

సిద్దిపేట శివారు రంగనాయక్ సాగర్ వద్ద తెలంగాణ తేజోవనం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని కోట్లాది మొక్కలు నాటారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో రైలు ట్రయల్ రన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి హరీశ్‌రావు తొలిసారి నియోజకవర్గానికి రావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్‌లో మంత్రి హరీశ్‌రావుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్