వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి రాజకీయంగా బురద జల్లడం సరికాదు- సుమన్

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు సుమన్(Suman) ఏపీ రాజకీయాలపై(Ap Politics) సంచలన కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల ఓక ఛానెల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజకీయ నాయకులు హీరోల పారితోషకాలపై మాట్లాడడం ఏంటి? పారితోషకాలకు, రాజకీయాలకు సంబంధం ఏంటి? ఆ విషయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదు.

సినీ పరిశ్రమ వాళ్ళు పకోడీగాళ్లు కాదు, వాళ్ళని విమర్శించే వాళ్లే బజ్జిగాళ్లు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు. ఇటీవల రజనీకాంత్ ను విమర్శించడం నాకు బాధ కలిగించింది. రాజకీయాలతో సంబంధం లేని ఆయనపై కూడా బురద చల్లుతున్నారు. నాకు తెలిసిన చాలా మంది రాజకీయ నాయకులకు రెండు మూడు కుటుంబాలున్నాయి. అయితే వాళ్ళు రాజకీయాలకు పనికిరారా. అలా ఏదైనా చట్టం ఉందా? లేదు కదా. ప్రతీ మనిషి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి రాజకీయంగా ఆయనపై బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యలు ఏమైనా న్యాయం చేయాలని మీ దగ్గరకు వచ్చారా? పవన్ తో పాటు చాలామంది రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళున్నారు. దమ్ముంటే వాళ్ళపై కూడా కామెంట్ చేయండి అంటూ తీవ్రంగా మండిపడ్డారు సుమన్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్  ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Latest Articles

భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్