Vande Bharat: వందే భారత్ రైలులో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో వందే భారత్ (Vande Bharat )ఎక్స్​ప్రెస్ రైలులో పొగలు రావడంతో మనుబోలు రెల్వే స్టేషన్‌లో దాదాపు గంటసేపు నిలిపివేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న వందేభారత్‌ రైలు మనుబోలు దగ్గర్లోకి రాగానే పొగలు రావడం మొదలయ్యాయి. సిబ్బంది గుర్తించి వెంటనే లోకో పైలట్‌కు (Loco Pilot) సమాచారం ఇచ్చారు. రైలును స్టేషన్‌లో నిలపడంతో భయాందోళనలో ఉన్న ప్రయాణికులు కిందకు దిగేశారు. రైలులో మూడో బోగీలోని బాత్‌రూమ్‌ నుంచి పొగలు (Smoke)రావడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించగా.. అక్కడ కాల్చి పడేసిన సిగరెట్ ముక్క సామగ్రికి అంటుకోవడం వల్ల పొగలు వచ్చాయని నిర్ధారించారు. ఈ ఘటనకు కారణమైన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వైఎస్ఆర్ కడప జిల్లాలోని రైల్వే స్టేషన్​లో మెమో ప్యాసింజర్ రైలుకు ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కడపకు వచ్చిన రైలు పట్టాలు తప్పింది. ప్రయాణికులంతా స్టేషన్లో దిగిన తర్వాత పట్టాలు తప్పడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్టేషన్​కు చేరుకున్న రైలు తిరిగి నుంచి నంద్యాలకు వెళ్లేందుకు మరో ప్లాట్ ఫారంలోకి మారే సమయంలో పట్టాలు తప్పి.. రెండు బోగీలు పక్కకు ఒరిగాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్