ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకిన బాలిక

స్వతంత్ర  వెబ్  డెస్క్: ఫోన్ ఎక్కువగా వాడద్ధు అని తల్లి మందలించింది… మనస్తాపంతో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఓ బాలిక. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న లేక్ పోలీసులు క్షణాల్లో బాలిక ను కాపాడారు. మెరుగైన చికిత్స కోసం బాలిక ను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది. KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాలిక, ప్రస్తుతం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం BiPC చదువుతోంది.
బాలిక తన మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుండడం మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేయడం గమనించిన తల్లిదండ్రులు మందలించడం తో ఆత్మహత్యయత్నం చేసుకుంది. అంతకు ముందు తమ కూతురు కనిపించడం లేదని తలిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.అయితే ఇక్కడ బాలిక తనతో పాటు తీసుకెళ్లిన మొబైల్ ఫోన్ ఏ తనని రక్షించింది. తమ కూతురు వాడుతున్న మొబైల్ నంబర్ ను పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఇచ్చారు. వెంటనే నెంబర్ ట్రేసింగ్ లో పెట్టారు పోలీసులు. బాలిక ఫోన్ దుర్గం చెరువు దగ్గరకి రాగానే ఆఫ్ కావడంతో వెంటనే దుర్గం చెరువు లేక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు KPHB పోలీసులు. కేబుల్ bridge పై న ఉన్న సీసీ కెమెరాల ద్వారా బాలిక దుర్గంచెరువు లో దూకినట్టు గుర్తించారు. వెంటనే లేక్ పోలీసులు స్పందించడం తో బాలిక ప్రాణాలు కాపాడగలిగారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్