27.9 C
Hyderabad
Friday, June 27, 2025
spot_img

‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో తిరువీర్

తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు యంగ్ హీరో తిరువీర్. ఓ వైపు సినిమాల‌తో పాటు ఓటీటీలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ జీ5 ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దానికి సంబంధించి జీ 5 అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.  ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ వెబ్ సిరీస్‌ను ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. విలక్షణ నటుడు తిరువీర్ ఈ టీమ్‌లో జాయిన్ కావ‌టంపై మేక‌ర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తిరువీర్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న న‌టిస్తున్నారంటూ జీ 5 అధికారికంగా ప్ర‌క‌టించింది. తిరువీర్ విల‌క్ష‌ణ న‌ట‌న‌తో త‌న పాత్ర‌ను డైరెక్ట‌ర్ ఊహించిన దాని కంటే ఇంకా బెట‌ర్ ఔట్ పుట్ ఇస్తార‌ని మేక‌ర్స్‌ భావిస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు వంటి డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌ని చేయ‌టంపై తిరువీర్ కూడా ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు.

ఇండియాలో భారీ విధ్వంసాన్ని  సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ RAW ఏజెంట్స్‌‌కి మధ్య నడిచే భావోద్వేగమైన హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ఇది. 8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను  ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఓటీటీలో ఎవ‌రూ నిర్మించని రీతిలో జీ 5 దీన్ని భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందిస్తోంది. అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను ఫారిన్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించ‌లేదు. కానీ తొలిసారి ‘మిషన్ తషాఫి’ సిరీస్‌ను విదేశాల్లో కూడా చిత్రీక‌రిస్తున్నారు. అలాగే ఇంట‌ర్నేష‌న‌ల్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ నేతృత్వంలో ఫైట్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు.

న‌టీన‌టులు: తిరువీర్‌, సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, భూష‌ణ్ క‌ళ్యాణ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు: బ్యాన‌ర్‌:  ఫిల్మ్ రిప‌బ్లిక్‌, నిర్మాత‌:  ప్ర‌ణ‌తి రెడ్డి, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌వీణ్ స‌త్తారు, సినిమాటోగ్ర‌ఫీ: న‌రేష్ రామ‌దురై, ఆర్ట్:  సాయి సురేష్‌, ఎడిట‌ర్‌:  ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, పి.ఆర్‌.ఓ:  ఫణి – నాయుడు (బియాండ్ మీడియా), డిజిట‌ల్:  టికెట్‌ ఫ్యాక్ట‌రీ.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్