Gurukul Admissions: మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యాసంవత్సారానికి సంబంధించి ప్రవేశాల్లో దళారులను అడ్డుకునేందుకు సొసైటీలు కొత్త విధానం అమల్లోకి తీసుకువచ్చాయి. 5వ, 6వ, 7వ, 8వ తరగతుల్లో కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించేలా కొత్త కార్యచరణను రూపొందించింది. ఈ విధానం ద్వారా విద్యార్థుల ప్రతిభ, సామాజిక పరిస్థితులు పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తామని మభ్య పెట్టేవారిపై కఠిన చర్యలకు పూనుకుంటోంది. మిగిలిన సీట్లకు ప్రతిభ ఆధారంగా విద్యార్ధులకు ఫోన్‌ చేసి లేదా ఎస్‌ఎంఎస్‌లు పంపించి ప్రవేశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కాగా గురుకులాల్లో అయిదో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్‌, డిగ్రీ వరకు చదువుకునేందుకు అవకాశం ఉన్నందున ఈ సీట్లకు డిమాండ్‌ బాగానే ఉంది. విద్య, వసతి ఉండడంతో సీట్లకు పోటీపడుతున్నారు. గురుకులాల్లో ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో అయిదో తరగతి, ఇంటర్‌, డిగ్రీతో పాటు బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్‌ జరుగుతోంది. కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిపోయిన సీట్లను ఈ  మేరకు భర్తీ చేయనున్నట్లు గురుకుల సొసైటీ తెలిపింది.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్