గవర్నర్‌‌కి తప్పని ట్రాఫిక్ ఇక్కట్లు..

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళసైకీ ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. గవర్నర్​ ప్రయాణిస్తున్న వాహనం హెవీ ట్రాఫిక్​లో నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం గవర్నర్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆమె కాన్వాయ్ కాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఖైరతాబాద్​ హనుమాన్​ టెంపుల్​కు వచ్చిన గవర్నర్​ తిరుగు ప్రయాణంలో రాజ్​భవన్​ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోమాజిగూడ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో కాన్వాయ్ నిలిచిపోయింది. ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వెంటనే కాన్వాయ్‌కు యూటర్న్ తీసుకోవడం కుదరలేదు. ఖైరతాబాద్​, ఎర్రమంజిల్​ మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్​ నిలిచిపోయింది. ట్రాఫిక్​ పోలీసుల సమన్వయంతోనే ఇట్లా జరిగిందని తెలుస్తోంది. కాగా, గవర్నర్​ భద్రతా సిబ్బంది ట్రాఫిక్​ని కంట్రోల్​ చేసే పనిలో నిమగ్నమయ్యారు. యూటర్న్ వద్ద వాహనాలను కొద్దిసేపు నిలిపివేయడంతో కాన్వాయ్ ముందుకు కదిలింది.

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్