స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశ నలుమూలలా బీఆర్ఎస్ ను వ్యాపించేందుకు చర్యలు చేపట్టిన సీఎం కేసీఆర్.. పార్టీ ఆఫీస్ లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆఫీసు ప్రారంభోత్సవానికి ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి, కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ పార్టీ కార్యాలయాన్ని రూ. 60 లక్షలతో నిర్మించినట్లు తెలుస్తోంది. నూతన కార్యాలయం వద్దకు చేరుకున్న కేసీఆర్కు మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, జోగు రామన్న పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.