స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టై జైలులో ఉంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు కొంత వెసులుబాటు కల్పించింది. తనను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న ఆయన అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫార్సు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు సీబీఐ కోర్టులో తనకు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 5కు విచారణను వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. కాగా వివేకా హత్య కేసులో అరెస్టై ఏప్రిల్ 16నుంచి భాస్కర్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.
ప్రత్యేక కేటగిరీ ఖైదీగా వైఎస్ భాస్కర్ రెడ్డి
0
611
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


