స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చారు అధికారులు. నేటి నుంచి మెట్రో స్టేషన్లలో వాడే పబ్లిక్ టాయిలెట్లకు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్‌లో టాయిలెట్ వాడకానికి 5 రూపాయలు, యూరినల్‌కు రూ.2 వసూలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉండగా.. ఇప్పటి వరకు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయడం లేదు. ఇకపై మాత్రం వాటికి డబ్బులు వసూలు చేయనున్నారు. ఇప్పటికే మెట్రో చార్జీల రాయితీల్లో కోతతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులకు తాజాగా టాయిలెట్ చార్జీలు మరింత భారం కానున్నాయి.