రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎలా పనిచేస్తా?: కోమటిరెడ్డి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత తనను కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ రమ్మని అడుగుతున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన.. తెలంగాణలో గెలవలేదని.. ఇక్కడి పరిస్థితులు వేరుగా ఉంటాయని తెలిపారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో దుష్ప్రచారాలతో బీజేపీని బలహీనం చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం కింద బ్లాక్ మెయిల్ చేసి రూ.కోట్లు సంపాదించారని ఆరోపించారు. టీడీపీలో నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ నాయకత్వంలో ఎలా పని చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ ను గద్దె దించడానికే బీజేపీలో చేరానని.. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే గట్టి పోటీ ఇవ్వగలదన్నారు. తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని.. ఎవరూ లాబీయింగ్ చేయడం లేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Latest Articles

వ్యాపారవేత్త ఇంట్లో కేజీ బంగారం మాయం.. నేపాలీ పనిమనుషులపై అనుమానం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఒక వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు అపహరించినట్టు సమాచారం. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు ప్రధాన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్