స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అమెరికాలో ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. మొన్నటికి మొన్న దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏలూరుకు చెందిన తెలుగు విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా టెక్సాస్ లోని క్లీవ్ లాండ్ లో ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. నగరానికి చెందిన యువకుడు రైఫిల్ షూటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా అక్కడి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన అతడు తన తుపాకీతో కాల్చడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉండడంతో అందరిని కలిచివేసింది. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉండడంతో పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో 174 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఐదుగురు మృతి
0
529
Previous article
Next article
Latest Articles
ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


