వరంగల్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను GWMC అధికారులు తొలగించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మున్సిపల్ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే నాయిని, మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించారు.
ఇవాళ వరంగల్‌కు కేటీఆర్ రానున్నారు. ఆయన రాక సందర్భంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రేపు రైతు సంఘం సదస్సు కూడా జరగనుంది.


