అటు అంబానీ ఇటు అదానీ మధ్యలో మోదీ

       నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రం వత్తాసుతోనే దేశ విదేశాల్లో అదానీ గ్రూపు చెలరేగిపోవడం అందరికీ తెలిసిన విషయమే.ప్రభుత్వ సంస్థల ఆస్తులు కాంట్రాక్టులు దానికే వెళ్లేలా చేయడంలో బిజెపి ప్రభుత్వ పాత్ర చాలా సార్లు వెల్లడైంది.అస్ట్రేలియా శ్రీలంక వంటి దేశాల్లోనూ అదానీ గ్రూపు తరఫున మోడీ సిఫార్సులు చేసినట్టు ఆ దేశాల నేతలే వెల్లడించారు.ఎపిలో గంగవరం కృష్ణపట్నం వంటి రేవులతో సహా,భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సహా అనేక ఆస్తులు టెండర్లు వారికే దక్కాయి.

      మరోవైపున స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపు షేర్ల రేట్లు విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయి.అతి పెద్ద కార్పొరేట్‌గా అంబానీల స్థానంలో అదానీ అవతరిస్తున్నట్టు కనిపించింది.అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని అనేది నానుడిగా మారింది.అంబానీలు అన్ని ప్రభుత్వాల్లోనూ చక్రం తిప్పినా మోడీ హయాంలో ఆయన ఇప్పుడైన కుబేరుడుగా అదానీకి తిరుగులేకుండా పోయిందని పారిశ్రామిక వర్గాలు భావించాయి.ఇలాటి తరుణంలో 2023 జనవరి 24న హిండెన్‌ బర్గ్‌ రీసెర్చి గ్రూపు అదానీ వ్యవహారాలపై ఒక సంచలన పరిశోధనా నివేదిక ప్రకటించింది.ఈ గ్రూపు షేర్లు ఇంతగా విజృంభిచడం వెనక అనైతిక ఆర్థిక పద్ధతులున్నాయనీ వెల్లడించింది.అదానీ గ్రూపు బినామీల ద్వారా తన షేర్లను అరువు తీసుకొని మార్కెట్‌ రేటుకు అమ్ముతూ మళ్లీ తక్కువ రేటుకు కొంటూ,కృత్రిమంగా గిరాకీ పెంచినట్టు వెల్లడించింది.

       స్టాక్‌ మార్కెట్‌ భాషలో దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు.అంటే ఒక సంస్థ మార్కెట్‌లో తన షేర్లను తనే తీసుకుని భారీగా అమ్మడం, తర్వాత చౌకగా కొనడం,రేటు పెరిగాక విడుదల చేయడం.ఇదే ఒక అభ్యంతరకర మార్గమైతే ఆ సంస్థకు సంబంధించిన బినామీలు లేదా భాగస్వాముల ద్వారానే భారీగా కొనుగోళ్లు అమ్మకాలు చేయించి జోరుగా పెరిగిపోతున్న భ్రమ కలిగించడం.ఇదంతా ఎందుకంటే సాధారణ మదుపరులు ఎగబడిపోయి షేర్లు కొనుగోలు చేయడానికి.మార్కెట్‌ విలువు బాగా పెంచి చూపించి రుణాలు,అడ్వాన్సులు పుట్టించుకోవడానికి,అన్నిటినీ మించి ప్రత్యర్థులను దెబ్బతీయ డానికి,ఈ క్రమంలో వీటినే ఆధారంగా చూపి ప్రభుత్వ బ్యాంకులు ఆర్థిక సంస్థలనుంచి ఉదారంగా అప్పులు,భాగస్వా మ్యాలు పొందడానికీ ఇవి ఉపయోగపడతాయి.అదానీ విషయంలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో సహా అనేక సంస్థలు విస్తారంగా సహకరించాయి.ఇదేగాక షేర్ల కొనుగోలులోనూ అవీ పాలుపంచుకు న్నాయి.ఈ క్రమంలో విపరీతంగా వందల కోట్లు చేతులు మారి మనీ లాండరింగ్‌ కార్యకలాపాలు సాగాయి.దీనిపై రెండేళ్ల పరిశోధన జరిపి ఇందుకు సంబంధిం చిన అనేక వాస్తవాలు వివరాలు హిండెన్‌ బర్గ్‌ బయట పెట్టింది.ఆ సమయంలో అదానీ గ్రూపు పెరుగుదల 817 శాతం గా వుండింది.ఆస్తుల విలువ 17,80,000 కోట్లు.ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన అదానీ వ్యవహరాలపై వెంటనే దర్యాప్తు జరపాలనీ,అన్ని నిజాలు బయిటపెట్టాలనీ ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి.

Latest Articles

రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు

వర్చువల్‌ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్